అందుకే అమెరికా వదిలి వెళ్ళాను
Actor ProfilePolitician

అందుకే అమెరికా వదిలి వెళ్ళాను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే అమెరికా వదిలి వెళ్ళాను
Sakshi25 Dec 2026
అందుకే అమెరికా వదిలి వెళ్ళాను

చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్‌కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022లో యూరప్‌తో పరిచయం నంద్ జావియాకు యూరప్‌తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలిసారి స్పెయిన్‌కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్‌ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్‌ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్‌ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్‌తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు. ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి? విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు. అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్‌ తర్వాత యూరప్‌లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు అయితే అమెరికాను వదిలి యూరప్‌కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన

అ ద క అమ ర క వద ల వ ళ ళ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in