అంతర్జాతీయ ఫుట్ బాల్ కు నెయ్ మార్ కన్నీటి వీడ్కోలు
Actor ProfilePolitician

అంతర్జాతీయ ఫుట్ బాల్ కు నెయ్ మార్ కన్నీటి వీడ్కోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంతర్జాతీయ ఫుట్ బాల్ కు నెయ్ మార్ కన్నీటి వీడ్కోలు
Sakshi24 Sept 2026
అంతర్జాతీయ ఫుట్ బాల్ కు నెయ్ మార్ కన్నీటి వీడ్కోలు

ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ నిష్క్రమణతో భావోద్వేగ నిర్ణయం బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం నెయ్‌మార్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-16లో నార్వే చేతిలో తన జట్టు ఓటమి (1-2) అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్‌ నుంచి తన జట్టు నిష్క్రమించాక తీవ్ర భావోద్వేగానికి లోనైన నెయ్‌మార్‌.. "ఎంతో ప్రయత్నించాను.. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది. ఇక్కడే నా ప్రయాణం ప్రారంభమైంది... ఇక్కడే ముగిసింది" అంటూ ఆటకు వీడ్కోలు ప్రకటించాడు. 16 ఏళ్ల ప్రయాణానికి ముగింపు 34 ఏళ్ల నెయ్‌మార్ 2010లో అమెరికాతో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రెజిల్ సీనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ కూడా న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలోనే జరిగింది. అదే వేదికపై నెయ్‌మార్‌ 16 సంవత్సరాల తర్వాత తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి జాతీయ జట్టుకు వీడ్కోలు పలకడం విశేషం. కల చెదిరింది బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ టైటిల్ సాధిస్తుందనే భారీ అంచనాల మధ్య నాకౌట్ దశలోకి అడుగుపెట్టింది. అయితే నార్వే సంచలన ప్రదర్శనతో బ్రెజిల్ ఆశలను ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్ చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. స్టాపేజ్ టైమ్‌లో నెయ్‌మార్ పెనాల్టీ ద్వారా బ్రెజిల్‌కు ఏకైక గోల్ అందించినప్పటికీ, అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. గాయాలు వెంటాడినా జట్టును ముందుండి నడిపించాడు గత కొన్ని సంవత్సరాలుగా నెయ్‌మార్‌ గాయాల కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయినప్పటికీ 2026 ప్రపంచకప్‌ను గెలవాలనే లక్ష్యంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదే తనకు ప్రపంచకప్ గెలిచే చివరి అవకాశం అని భావించిన నెయ్‌మార్‌కు ఈ ఓటమి మరింత బాధ కలిగించింది. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర నెయ్‌మార్ డ సిల్వ శాంటోస్‌ జూనియర్‌ అలియాస్‌ నెయ్‌మార్‌ జూనియర్‌ బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేశాడు. ఆ దేశం తరఫున అతడు

అ తర జ త య ఫ ట బ ల క న య మ ర కన న ట వ డ క ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in