అంగీ’
Actor ProfilePolitician

అంగీ’

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంగీ’ పైపైకి.. లాగు’ జారిపోతోంది.. కొలతలు మారిన ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్
Zee Telugu21 Dec 2026
అంగీ’ పైపైకి.. లాగు’ జారిపోతోంది.. కొలతలు మారిన ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Govt School Uniform Issue Telangana: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీలో తీవ్ర అక్రమాలు, అలసత్వం వెలుగుచూశాయి. సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన యూనిఫాంల పంపిణీ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. పంపిణీ చేసిన దుస్తుల కొలతల్లో భారీ తేడాలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల్లో బాలికలకు కేటాయించిన దుస్తులు కొంతవరకు ఫర్వాలేదనిపించినా, బాలురకు అందించిన చొక్కాలు (అంగీలు), లాగుల పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా తయారైంది. కొందరు విద్యార్థులకు చొక్కాలు మరీ పొట్టిగా, బిగుతుగా ఉంటే.. మరికొందరికి అతిగా పొడవుగా, వదులుగా ఉన్నాయి. నాణ్యత లేని కుట్లు ఉండటంతో పాటు చొక్కాలు, లాగులు ఒకవైపు పైకి, మరోవైపు కిందికి వేలాడుతూ అసమానంగా ఉన్నాయని ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ లోపాలను గమనించిన పలువురు ఉపాధ్యాయులు, ఇలాంటి నాసిరకం దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేయలేమని స్పష్టం చేస్తూ పంపిణీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో పాటు వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారముపై హుస్నాబాద్ ఎంఈవో మనీల స్పందిస్తూ.. యూనిఫాంల కొలతల్లో తేడాలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ దుస్తులను కుట్టిన మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాట్లాడి, కొలతలను సరిచేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుస్తులను పునర్నిర్మించి సరిచేసే వరకు విద్యార్థులకు పంపిణీ చేయవద్దని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

అ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in