
ఇంటర్నెట్‌డెస్క్: వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షను తొలినుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి కె.అరుణ్‌రాజ్ మంగళవారం ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు. దీనికి ప్రధాన విపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే మద్దతు తెలిపాయి. టీవీకేకు మిత్రపక్షాల నుంచి ఎలాగూ మద్దతు ఉంది. ఒక్క భాజపా మాత్రం సభ నుంచి వాకౌట్ చేసింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోగ్య మంత్రి అరుణ్‌రాజ్ మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నీట్ (NEET)ను రద్దు చేయాలి. ఈ ప్రవేశ పరీక్షవల్ల విద్యార్థుల దృష్టి కోచింగ్ సెంటర్ల వైపు మళ్లింది. ఫీజులు భారీగా వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని, సామాజికంగా-ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల హక్కులకు ఈ పరీక్ష వ్యతిరేకం అనే విషయాన్ని తమిళనాడులోని ప్రతి ప్రభుత్వం వాదిస్తోన్న విషయాన్ని గుర్తుచేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం ఉండాలని విజయ్ (Vijay) ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో డీఎంకే ఇదే ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ అంశాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం తీర్మానంలో ప్రస్తావించింది (NEET Row). విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ పరీక్ష ఒత్తిడి కారణమని పేర్కొంది. నీట్ రద్దుతోనే వాటికి ముగింపు వస్తుందని అభిప్రాయపడింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర