
Andhra Jyothy•30 Dec 2026
అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లువైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై వైసీపీపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారని అన్నారు. వైసీపీ కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతుందని ఆగ్రహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి రాకపోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలని.... పారిపోకూడదని అన్నారు