మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు.. సభలో ఎల్‌నినో అంశంపై చర్చించాలని సూచించారు. రఘువీరారెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైఎస్సార్‌సీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని.. వారు సభకు దూరంగా ఉండటం సరికాదన్నారు.ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎష్ జగన్ అసెంబ్లీకి వెళ్లి ఎల్‌నినోపై సలహాలు ఇవ్వొచ్చన్నారు రఘువీరారెడ్డి. రాష్ట్రంలో రైతులు ఎల్‌నినో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చించి కేంద్రం సహకారంతో రైతుల్ని ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో దెబ్బకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని..వర్షాలు లేక రైతులు వేసిన పంటలు కనీసం మొలకెత్తలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్‌నినో గండం నుంచి రైతులను ఆదుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు రఘువీరారెడ్డి.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపేయాలని రఘువీరారెడ్డి కోరారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాల వినియోగంపై చర్చిస్తే జలవివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ తుంగభద్రలో నీటి వాటాను అడగకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యా వ్యవస్థలో సమస్యలపై విద్యార్థి గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తు్న్నామని.. యువత భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ మేధో నక్సల్స్ అన్న మాటను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు మాజీ
Actor ProfilePolitician
అసెంబ్లీకి వెళ్లి ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కదా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Jan 2027
అసెంబ్లీకి వెళ్లి ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కదా