అల్లుడి ప్రవర్తన చూసి గుండెల్లో దడ.. బండ్ల గణేష్ వార్నింగ్
Actor ProfileActor

అల్లుడి ప్రవర్తన చూసి గుండెల్లో దడ.. బండ్ల గణేష్ వార్నింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అల్లుడి ప్రవర్తన చూసి గుండెల్లో దడ.. బండ్ల గణేష్ వార్నింగ్
Zee Telugu9 Jan 2027
అల్లుడి ప్రవర్తన చూసి గుండెల్లో దడ.. బండ్ల గణేష్ వార్నింగ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Bandla Ganesh: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో కూడా సందడి వాతావరణం కనిపించింది. ముఖ్యంగా బండ్ల గణేష్ అల్లుడు సూర్య చేసిన డ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీత్ వేడుకలో సూర్య ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన డ్యాన్స్ చూసిన అభిమానులు, కుటుంబ సభ్యులు గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. సూర్య అంత ఎనర్జీతో డ్యాన్స్ చేయడం చూసి బండ్ల గణేష్ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన మైక్ తీసుకుని తన అల్లుడిపై సరదాగా కామెంట్స్ చేశారు. “నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు గుండెల్లో దడ మొదలైంది” అంటూ బండ్ల గణేష్ సరదాగా అన్నారు. తన అల్లుడు ఇంత బాగా, ఇంత ఎనర్జీతో డ్యాన్స్ చేస్తాడని తాను అసలు ఊహించలేదని చెప్పారు. ఆయన మాటలు అక్కడ ఉన్న వారందరినీ నవ్వించాయి. అంతేకాదు.. సూర్యకు హీరో అవ్వాలనే ఆలోచన రావద్దని కూడా బండ్ల గణేష్ సరదాగా సూచించారు. అక్కడ ఉన్న దర్శకులందరినీ ఉద్దేశిస్తూ.. తన అల్లుడు చేసిన డ్యాన్స్‌ను మర్చిపోవాలని అన్నారు. సూర్య మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదగాలని, సినిమాల్లో హీరోగా చేయాలని మాత్రం అనుకోవద్దని చమత్కరించారు. దీనికి సూర్య కూడా సరదాగా సమాధానం ఇచ్చారు. తన భార్యపై ఉన్న ప్రేమతోనే తాను ఆ డ్యాన్స్ చేశానని చెప్పారు

అల ల డ ప రవర తన చ స గ డ ల ల దడ బ డ ల గణ ష వ ర న గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in