అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ
Actor ProfilePolitician

అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ
TV9 Telugu9 Oct 2026
అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజ నటుల నిబద్ధత, అంకితభావం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ, కృష్ణ, చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్ వంటి నటులు తమ పని పట్ల చూపిన పట్టుదల, వృత్తిపరమైన నిబద్ధత వల్లే తెలుగు సినీ పరిశ్రమకు అనేక విజయాలు లభించాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అంకితభావం గురించి కోడి రామకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడారు. బాలకృష్ణకు ఒక కథ నచ్చితే, ఆ పాత్రకు మరెవ్వరూ సరిపోరు అన్నంతగా తన్మయత్వంతో నటించేస్తారని ఆయన అన్నారు. బాలకృష్ణ పట్టుదల “భయంకరమైనది” అని రామకృష్ణ అన్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, బాలకృష్ణ సెట్‌లో అందరితో స్నేహపూర్వకంగా, వినయంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ అంకితభావానికి ఉదాహరణగా ఒక డాన్స్ షూటింగ్ సంఘటనను రామకృష్ణ వివరించారు. ఒకసారి విజయశాంతితో కలిసి ఒక డాన్స్ నర్సరీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక ఫాస్ట్ డాన్స్ మూమెంట్ మధ్యలో బాలకృష్ణ కాలుకు తీవ్రమైన గాయమైంది. నర్సరీలో కట్ చేసిన చెట్ల మొద్దులు కింద ఉండేవి. డాన్స్ చేస్తుండగా, ఒక పదునైన మొద్దు బాలకృష్ణ కాలిలోకి గుచ్చుకుపోయింది. నొప్పి విపరీతంగా ఉన్నా, రక్తం కారుతున్నా, బాలకృష్ణ షూటింగ్ ఆపడానికి నిరాకరించారు. బాలకృష్ణ రాకపోవడంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. ఆయనను చూసినప్పుడు, కాలిలో మొద్దు గుచ్చుకుపోయిందని, అది బయటకు రావట్లేదని అర్థమైంది. వెంటనే డాక్టర్లను పిలిచారు. వారు వచ్చి, కాలిలో గుచ్చుకున్న మొద్దును తీయడానికి ఆ చుట్టూ ఉన్న నేలను తవ్వి, మొద్దును బయటకు తీయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు దాదాపు గంట సమయం పట్టింది. కాలు శుభ్రం చేయించుకున్న వెంటనే, బాలకృష్ణ “తరువాత షాట్ ఏంటి?” అని అడిగారు. తన కాలికి అయిన గాయాన్ని, నొప్పిని లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేయాలన్న ఆయన పట్టుదల యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

అల ట హ ర న ఎక కడ చ డల ద రక త క ర న సర నట స త న ఉ డ వ డ డ ర క టర క డ ర మక ష ణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in