
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా సెలబ్రిటీల ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా నటి పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) కూడా తన అకౌంట్‌కు సబ్‌స్క్రిప్షన్ పెట్టారు. దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేశారు. వారికి సమాధానమిస్తూ పాయల్ పోస్ట్ చేశారు. తన సబ్‌స్క్రిప్షన్ ఛానల్‌లో ఎలాంటి కంటెంట్ ఉండనుందో స్పష్టం చేశారు. ‘హాట్ పిక్స్’, బోల్డ్ కంటెంట్ కోసం ఆశించే వారెవరూ తన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దని చెప్పారు. ‘‘నా ఛానల్‌లో నేను ఎలాంటి కంటెంట్ షేర్ చేయబోతున్నాననే దానిపై చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు బోల్డ్ కంటెంట్ ఆశించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే.. మీకు ఇది సరైన ఛానల్ కాదు. తెర వెనుక ఉండే నా నిజమైన జీవితాన్ని చూడాలనుకునే వాళ్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నా వ్యక్తిగత పరిధిని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని పాయల్ పేర్కొన్నారు. ఇందులో తన అభిప్రాయాలు మాత్రమే ఉంటాయని.. అంతకు మించి మరేమీ ఆశించవద్దని ఆమె స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు