అలాంటి పాత్ర చేయడానికి గట్స్ కావాలి.. ఆయన
Actor ProfileActor

అలాంటి పాత్ర చేయడానికి గట్స్ కావాలి.. ఆయన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అలాంటి పాత్ర చేయడానికి గట్స్ కావాలి.. ఆయన గురించి మాటల్లో చెప్పలేం.. జయప్రద
TV9 Telugu14 Dec 2026
అలాంటి పాత్ర చేయడానికి గట్స్ కావాలి.. ఆయన గురించి మాటల్లో చెప్పలేం.. జయప్రద

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. మాయాబజార్, శంకరాభరణం వంటి అద్భుతమైన చిత్రాల సరసన సాగర సంగమం నిస్సందేహంగా నిలుస్తుంది. కొంతమంది ప్రేక్షకులు, అలాగే సినీ ప్రముఖులు శంకరాభరణం కన్నా కె. విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి సాగర సంగమం అని కూడా అభిప్రాయపడతారు. అలాంటి ఒక అపురూపమైన చిత్రంలో మాధవి అనే కీలకమైన, ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రను పోషించిన నటి జయప్రద తన అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మాధవి పాత్ర తన జీవితంలో ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని జయప్రద తెలిపారు. ఈ పాత్ర లభించడం ఒక ఆర్టిస్ట్‌కు దొరికే గొప్ప ఛాలెంజ్ అని, తన దర్శకుడు కె. విశ్వనాథ్ తన వెనకాల నిలబడి చేయించారని ఆమె అన్నారు. మాధవి పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్భుతమని, ప్రతి కళాకారుడి వెనకాల ఒక మాధవి ఉంటే బాగుంటుందనిపించేలా ఆ పాత్రను విశ్వనాథ్ గారు సృష్టించారని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎన్నో మంచి చిత్రాల్లో, ఆణిముత్యాల్లో ప్రథమ శ్రేణిలో ఉంటుందని జయప్రద చెప్పారు. సాగర సంగమం వచ్చిన సమయంలో తాను కమర్షియల్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నానని, బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపుతో ఉన్నానని జయప్రద గుర్తు చేసుకున్నారు. అటువంటి సమయంలో ఓల్డ్ రోల్ చేయడానికి చాలా మంది తనను వద్దని, అది తన కెరీర్‌ను ప్రభావితం చేస్తుందని అన్నారని తెలిపారు. అయినప్పటికీ, తాను “నా కెరీర్ పోనీ, తర్వాత పిక్చర్లు చేయక పోనీ, నాకు రాక పోనీ. బట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. దీని తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా పర్వాలేదు” అని నిర్ణయించుకుని ఈ చిత్రంలో నటించానని ఆమె ధైర్యంగా చెప్పారు. అలాగే కమల్ హాసన్ పోషించిన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కమల్ హాసన్ పోషించిన ఒక పాత్ర అఖిల భారతీయ నృత్య కార్యక్రమాలలో పాల్గొనాలని గొప్ప

అల ట ప త ర చ యడ న క గట స క వ ల ఆయన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in