అర్జున్ బర్త్ డే స్పెషల్.. పొలిమేర 3’లో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
Actor ProfileCelebrity

అర్జున్ బర్త్ డే స్పెషల్.. పొలిమేర 3’లో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అర్జున్ బర్త్ డే స్పెషల్.. పొలిమేర 3’లో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
Chitrajyothy25 Dec 2026
అర్జున్ బర్త్ డే స్పెషల్.. పొలిమేర 3’లో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తోన్న మిస్టిక్ థ్రిల్లర్ ‘పొలిమేర-3’. ఈ మూవీ నుంచి అర్జున్ ప్రీ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తోన్న మిస్టిక్ థ్రిల్లర్ ‘పొలిమేర-3’ (Polimera 3). ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా (Action King Arjun Sarja) ఓ కీలకమైన పాత్ర చేస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న అర్జున్‌ పుట్టినరోజు (HBDArjunSarja) సందర్భంగా మేకర్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అర్జున్ ‘విరావి’ (Viraavi)గా కనిపించబోతున్నారని తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఇందులో ఆయన కండలు తిరిగిన చేతిపై ఉన్న పరమశివుని త్రిశూలం, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం టాటూలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచిందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, దక్షిణాది వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌తో ప్రేక్షకులను అలరించే అర్జున్ ఎంట్రీతో ‘పొలిమేర 3’పై అంచనాలు మరింత పెరిగాయి. ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, ‘పొలిమేర 2’తో థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టింది. విజనరీ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొలిమేర 3’ చిత్రాన్ని వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ మూడో ఫ్రాంచైజ్ గత చిత్రాల హద్దులను దాటి ముందుకు వెళ్లనుందని, మరింత లోతైన మిస్టరీలు, డార్క్ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, షాకింగ్ రివిలేషన్స్‌తో ‘పొలిమేర’ యూనివర్స్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లనుందని మేకర్స్ చెబుతున్నారు. సత్యం

అర జ న బర త డ స ప షల ప ల మ ర 3 ల పవర ఫ ల ప స టర వ డ దల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in