అర్జెంటీనా దిగ్గ జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన
Actor ProfilePolitician

అర్జెంటీనా దిగ్గ జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అర్జెంటీనా దిగ్గ జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన
Sakshi1 Nov 2026
అర్జెంటీనా దిగ్గ జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) ఆదివారం కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్‌ కీలక పాత్ర పోషించారు. అయితే ఆదివారం ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైన‌ల్లో స్విట్జ‌ర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆంటోనియో మృతి ప‌ట్ల అర్జెంటీనా జ‌ట్టు సంఘీభావం ప్ర‌క‌టించి ఆయ‌న మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. రెడ్‌, యెల్లో కార్డుల‌కు ఆద్యుడు 1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జ‌ర్మ‌న్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బ‌ల‌వంతంగా మైదానం నుంచి బయటకు పంప‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అయితే ఆ స‌మ‌యంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడ‌కుండా త‌న‌కు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిర‌స‌న‌కు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది. దెబ్బ‌కు దిగొచ్చిన ఫిఫా దీంతో మ‌రుస‌టి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లకు రెఫరీ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేయబడటానికి మార్గం సుగమం అయ్యింది. ఇక రాటిన్ తన కెరీర్‌ను 'బోకా జూనియర్స్' క్లబ్‌కు అంకితం చేశారు, అక్కడ 1956 నుంచి 1970 వరకు 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1962, 1966 ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆంటోనియో రాటిన్‌ కోచ్‌గా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. మైదానంలో తన అంకితభావం, దేశం పట్ల గర్వంతో ఆడిన గొప్ప ఆటగాడిగా ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతితో, ఫుట్‌బాల్ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని

అర జ ట న ద గ గ జ కన న మ త వ ష ద ల మ స స స న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in