
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత కోసం చేపట్టిన ఓ అసాధారణ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో కనిపించిన దృశ్యాల వెనుక ఓ రహస్య వ్యూహం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. కెమెరాల ముందు ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఎక్కినట్లు కనిపించారు. కానీ అది కేవలం డీకాయ్ (మభ్యపెట్టే ఏర్పాటు) మాత్రమేనని.. అసలు ఆయనను ఓ చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్‌లో ఓ సాధారణ క్యాటరింగ్ ట్రక్ కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. టర్కీ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా అధికారులు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ ముందుగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి ఎక్కినట్లు కనిపించిన తర్వాత.. విమానం మరో వైపు నుంచి క్యాటరింగ్ ట్రక్ దగ్గరకు వెళ్లింది. సాధారణంగా విమానాలకు ఆహారం, ఇతర సరఫరాలు అందించే ఆ వాహనాన్ని ఈసారి భద్రతా వ్యూహంలో భాగంగా ఉపయోగించారు. ట్రక్ సహాయంతో ట్రంప్, ఆయన సిబ్బందిని ఎవరికీ కనిపించకుండా బయటకు తీసుకొచ్చి C-32A సైనిక విమానంలోకి తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. డీకాయ్‌గా పాత విమానం.. అసలు ప్రయాణం మరో విమానంలో ఈ వ్యూహం కారణంగా మీడియా ప్రతినిధులు, కొంతమంది సిబ్బంది కూడా ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ప్రయాణిస్తున్నారని భావించారు. కానీ ఆయన మాత్రం C-32A విమానంలో బ్రిటన్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఎందుకీ రహస్య ఆపరేషన్? ట్రంప్ టర్కీలో ఉన్న సమయంలో ఇరాన్ అనుబంధ వర్గాల నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం అందినట్లు నివేదికలు తెలిపాయి. అధ్యక్షుడి ప్రయాణ మార్గం, విమానం వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ