
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ, జులై 13: అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ మందిరానికి భక్తులు సమర్పించిన నగదు, విలువైన వస్తువుల విరాళాల దుర్వినియోగం, చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత ఈ కేసుపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. ట్రస్టుకు కూడా నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేయడాన్ని సాలిసిటర్ జనరల్ వ్యతిరేకించినప్పటికీ, ధర్మాసనం మాత్రం ట్రస్ట్‌కు కూడా నోటీసులు పంపడానికే మొగ్గు చూపింది. విచారణ బృందంలో ఎవరున్నారు? ఇప్పటివరకు దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది? అనే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ 'సిట్' ను ఆదేశించింది. విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. 'సిట్' దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. దీనిపై పిటిషనర్లు తమకు కూడా ఆ కాపీ కావాలని కోరగా, సాలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు సీజేఐ స్పందిస్తూ.. 'మీకు చట్టం తెలుసు కదా.. ఎలాగైనా చివరికి వారు ఆ నివేదికను చూస్తారు' అని వ్యాఖ్యానించారు. అలాగే కోర్టులో గట్టిగా మాట్లాడుతున్న ఒక న్యాయవాదితో.. 'మీరు ఇక్కడ కేకలు