
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ (Ayodhya Ram Temple donation theft) కేసులో కీలక ఆధారాలను సేకరించినట్లు సిట్ వెల్లడించింది. ఈ విషయంపై యూపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు విరాళాల లెక్కింపు చేపట్టిన వ్యక్తుల్లో కొందరు డబ్బులు అపహరించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో తేలిందని (SIT finds evidence) పేర్కొంది. ఈ 39 రోజుల్లో లెక్కించే సమయంలో కొంతమంది సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లరను తమ దుస్తులు, జేబులు, బూట్లలో దాచిపెట్టినట్లు సీసీటీవీ రికార్డుల్లో కనిపించిందని తెలిపింది. డబ్బును సిబ్బంది దొంగలిస్తున్నట్లు (Donation Theft) చూసిన కొందరు అధికారులు కూడా వారిని ఆపడానికి ప్రయత్నించలేదని సిట్ పేర్కొంది. నిందితులు దాదాపు 70 సార్లు దొంగతనాలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బంది, లెక్కింపు సిబ్బందిని విచారించామన్నారు. వారి వాంగ్మూలాల ప్రకారం ఏప్రిల్ 27కి ముందు కూడా విరాళాల చోరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పాత సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషయంలో ఆధారాలు సేకరించడం సవాలుగా మారిందన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్ చేస్తున్నామని.. బ్యాంకు రికార్డులు, విరాళాల పత్రాలు, ఆలయ నిర్మాణ వ్యయాలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆలయం (Ayodhya Ram Mandir)లో భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ పరికరాలపై పరిమితులు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యల్లో అనేక లోపాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లోపాలను వినియోగించుకుని నిందితులు చోరీకి పాల్పడ్డారని తెలిపారు. విలువైన కానుకల నిర్వహణ, డాక్యుమెంటేషన్, తూకం వేయడం వంటి వాటిల్లోనూ పలు విధానపరమైన లోపాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్