అమీర్ లోగ్ ’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది
Actor ProfileActor

అమీర్ లోగ్ ’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమీర్ లోగ్ ’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది
Sakshi7 Jan 2027
అమీర్ లోగ్ ’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది

‘‘అమీర్‌ లోగ్‌’ చిత్రంలో అన్నిరకాల వాణిజ్య అంశాలుఉన్నాయి. ఈ సినిమా కేవలం యువతకి మాత్రమే కాదు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలతో కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’’ అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్‌ నిట్టూరు, విశ్వేందర్‌ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్‌ లోగ్‌’. అవ్వల్‌ నంబర్‌ ప్రొడక్షన్స్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్‌ మీడియా ఈ నెల 21న విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో రమణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్‌టీయూలో ఆర్టిటెక్ట్‌ చదివాను. మూడేళ్ల క్రితం షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను. ‘అమీర్‌ లోగ్‌’ సినిమాని బస్తీలోనే షూట్‌ చేయాల్సి రావడంతో సింక్‌ సౌండ్‌ని వాడాం. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ చాలా బాగా నటించారు. ‘అమీర్‌ లోగ్‌’కి రానాగారి సపోర్ట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్యగారు అమితాబ్‌గారి ‘ఝుండ్‌’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘గల్లీబాయ్‌’ చిత్రాలతో పోల్చడం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

అమ ర ల గ న అమ త బ చ త ర లత ప ల చడ హ య ప గ ఉ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in