
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన రోజునే అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) మృతిచెందారు. టెహ్రాన్‌లోని కాంపౌండ్‌లో ఆయనతో పాటు ఇతర కీలక నేతల లక్ష్యంగా ఆ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఖమేనీని గురువారం సమాధి చేయనున్న నేపథ్యంలో దాడుల్లో దెబ్బతిన్న ఆ భవనం దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా షేర్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో.. అత్యంత దారుణంగా భవనం దెబ్బతిన్న దృశ్యాలు కన్పించాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు