అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం
Actor ProfileCelebrity

అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం
Asianet News Telugu20 Nov 2026
అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం

ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరింది. అలాగే, ఇరాన్ నౌకాశ్రయాలపై అమలులో ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని, తమ భూభాగం సమీపంలోని అమెరికా సైనిక ఉనికిని తగ్గించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. ఈ షరతులు అమలైన తర్వాతే హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇటీవల ఇరు దేశాల నడుమ జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినా, తుది ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా ముందుగా హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సాధారణ స్థితికి రావాలని కోరుతోంది. ఆ తర్వాతే ఆంక్షల సడలింపు, నిధుల విడుదల వంటి అంశాలను పరిశీలిస్తామని భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ముందు తమ డిమాండ్లు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో రెండు దేశాల నడుమ చర్చలు ముందుకు సాగకుండా ప్రతిష్ఠంబన నెలకొంది. హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఒమన్‌తో సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. అయితే అవి కేవలం నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించినవేనని, అమెరికాతో ఉన్న రాజకీయ, ఆర్థిక వివాదాలకు వాటికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని మరోసారి ప్రకటించింది. అవసరమైతే చర్చల గడువును పొడిగించే అవకాశాన్ని కూడా ఇరు పక్షాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎగుమతి అయ్యే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ కారణంగా హర్మూజ్ జలసంధిపై ఏ చిన్న ఉద్రిక్తత ఏర్పడినా అంతర్జాతీయ

అమ ర క క ఇర న అల ట మ ట ఈ షరత లక ఒప ప క ట న హర మ జ జలస ధ త ర స త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in