అమ్మానాన్న ఉద్యోగస్తులు.. మేం ప్రయోజకులం కాలేమన్నారు
Actor ProfileActor

అమ్మానాన్న ఉద్యోగస్తులు.. మేం ప్రయోజకులం కాలేమన్నారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమ్మానాన్న ఉద్యోగస్తులు.. మేం ప్రయోజకులం కాలేమన్నారు
AP7AM11 Dec 2026
అమ్మానాన్న ఉద్యోగస్తులు.. మేం ప్రయోజకులం కాలేమన్నారు

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన బాల్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో, చిన్నప్పుడు తనను, తన సోదరిని చూసి చాలామంది జీవితంలో పైకిరారని అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఎం9 న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాధవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.జంషెడ్‌పూర్‌లో తన బాల్యం గడిచిందని మాధవన్ తెలిపారు. ఆయన తండ్రి రంగనాథన్ ఒక ప్రైవేట్ సంస్థలో, తల్లి సరోజ బ్యాంకులో పనిచేసేవారని చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో, పిల్లల బాగోగులు, హోంవర్క్ చూసేవారు ఎవరూ లేరని ఇరుగుపొరుగు వారు అనేవారని ఆయన పేర్కొన్నారు. "పిల్లల భవిష్యత్తు కంటే మీకు ఉద్యోగాలే ముఖ్యమా?" అంటూ చుట్టుపక్కల వారు తరచూ తమ తల్లిదండ్రులను నిందిస్తూ, వారిని బాధపెట్టే ప్రయత్నం చేసేవారని మాధవన్ వివరించారు.అయితే, తన తల్లిదండ్రులు ఇలాంటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "చాలామంది అనుకున్నట్టు నేను ఇంజనీర్‌ను కాదు. కేవలం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి, అతికష్టం మీద పాసయ్యాను. చదువులో నేనేమీ గొప్పవాడిని కాదు," అని మాధవన్ నిజాయితీగా అంగీకరించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదించడం వల్లే తనకు ఎక్స్ఛేంజ్-స్టూడెంట్ ప్రోగ్రామ్స్, స్కాలర్‌షిప్స్ కింద విదేశాలకు వెళ్లే అవకాశాలు లభించాయని, అవే తన జీవితాన్ని మార్చేశాయని ఆయన తెలిపారు.తమ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తనకు గర్వకారణమని, వారు తమకు ఒక మంచి ఉదాహరణగా నిలిచారని మాధవన్ అన్నారు. పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోయినా ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చనే తన