సినీ హీరోల అభిమానులంటే వారి సినిమాల సందర్భాల్లో థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడం, పుట్టినరోజున కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే తాము అందరి హీరోల ఫ్యాన్స్‌లా కాదంటూ తాజాగా నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు. సినిమా వేడుకలు, ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ లక్ష్యానికి మద్దతుగా, ‘ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ’ ( AAFA ) దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం చేపట్టిన అవగాహన ఉద్యమం విశేష స్పందనను రాబడుతోంది. ముఖ్యంగా ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్ ) నివారణకు దోహదపడే హెచ్‌పీవీ (HPV) టీకా ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.* ‘బల్లగుద్ది చెప్తున్నా.. సినిమా అందరికీ నచ్చుతుంది’: ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ధీమా7 రాష్ట్రాలు.. 400కి పైగా సదస్సులు ‘ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే ప్రధాన ఆశయంతో AAFA ఈ మహా యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 రాష్ట్రాల్లో 400కి పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసి, సుమారు లక్ష మందికి పైగా యువతులకు, పాఠశాల-కళాశాల విద్యార్థినులకు ప్రత్యక్షంగా చేరువయ్యారు. సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్లను సకాలంలో టీకా తీసుకోవడం ద్వారా ఎలా నిరోధించవచ్చో వైద్య నిపుణుల సమక్షంలో వివరించారు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వయసున్న బాలికలు, యువతులకు ఈ వ్యాక్సిన్ అత్యంత కీలకమని తెలియజేస్తూ, చిన్న వయసులోనే టీకా తీసుకోవడం వల్ల కలిగే రక్షణను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత టీకా సదుపాయాల గురించి సాధారణ ప్రజలకు సులభంగా
Actor ProfileActor
అభిమానానికి సరికొత్త నిర్వచనం.. సమాజ సేవలో ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Jan 2027
అభిమానానికి సరికొత్త నిర్వచనం.. సమాజ సేవలో ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్