అఫైర్ల ఆరోపణల
Actor ProfileActor

అఫైర్ల ఆరోపణల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఫైర్ల ఆరోపణలపై నోరు విప్పిన గోవిందా
AP7AM26 Nov 2026
అఫైర్ల ఆరోపణలపై నోరు విప్పిన గోవిందా

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తన గతంలోని ప్రేమ వ్యవహారాలపై భార్య సునీత అహుజా తరచూ చేసే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై విమర్శలు చేయడం ద్వారా పాపులారిటీ పొందేందుకే సునీత అలా మాట్లాడుతోందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలపై స్పందించారు."విమర్శలు చేయడం ద్వారా గుర్తింపు పొందడం చాలా సులభం. సునీత అదే పనిని తెలివిగా చేస్తోంది. ముందు నాలుగు పొగడ్తలు పొగిడి, ఆ తర్వాత విమర్శిస్తుంది. ఆమె నన్ను ప్రేమతోనే తిడుతుంది, నేను కూడా దాన్ని ప్రేమతోనే స్వీకరిస్తాను. అందులో నాకు ప్రేమే కనిపిస్తుంది" అని గోవిందా అన్నారు. తాను కెరీర్‌తో బిజీగా ఉన్నప్పుడు పిల్లలను పెంచడంలో సునీత తీసుకున్న బాధ్యతను ఆయన ప్రశంసించారు.తన హీరోయిన్లతో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ.. "హీరోయిన్‌తో నేను ఒక ప్రేమ సంబంధాన్ని ఏర్పరుచుకుంటాను. అప్పుడే మా మధ్య కెమిస్ట్రీ పండి పాటలు విజయవంతం అవుతాయి" అని గోవిందా అంగీకరించారు. "స్వీట్ షాప్‌లో ఉండి ఆకలితో బయటకు వస్తే అది చాలా బాధాకరం కదా?" అంటూ ఆయన పరోక్షంగా తనపై వచ్చిన ఆరోపణలపై వ్యాఖ్యానించారు.ఒకానొక దశలో తన అమాయకత్వం చూసి తనకే సిగ్గేస్తుందని, 21 నుంచి 34 ఏళ్ల వయసు మధ్య జీవితంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని గోవిందా తెలిపారు. వివాహం అయినంత మాత్రాన పురుషులు తప్పుడు దారులు తొక్కకుండా ఉండలేరని, కానీ మహిళలు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని స్థిరంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.గోవిందా

అఫ ర ల ఆర పణల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in