
బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏమాత్రం వ్యతిరేకించని సిట్ మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం మరోసారి బట్టబయలు తాము చెప్పినట్లు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే ఎంతకైనా బరితెగిస్తారనేందుకు ఇదే నిదర్శనం.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిట్ తీరు మొదటి నుంచీ ఇంతే తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వక పోతే అరెస్ట్‌లు.. వేధింపులు ప్రలోభాలతో టార్గెట్ చేసిన వారి పేర్లు చెబితే బెయిల్ వచ్చేలా సహకారం కూటమి కుట్రలో భాగంగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో అప్రూవర్ డ్రామాకు రంగం సిద్ధం.. తప్పుడు సాక్ష్యాలతో లేని ఆధారాలు సృష్టించేందుకు బరితెగింపు చట్టానికి పాతరేసి ఇష్టారాజ్యంగా తప్పుడు కేసును నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇలాగైతే న్యాయం, ధర్మం ఎక్కడుందని సర్వత్రా విమర్శలు, ఆవేదన సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. తాము చెప్పినట్లు విని తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే అరెస్ట్ చేయకుండా, ముందస్తు బెయిల్‌కు సహకరిస్తామని ప్రలోభపెట్టిన సిట్.. ఆ మేరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో తమకు అనుకూలమైన విధంగా పేర్లు చెప్పించుకుని.. ఆపై ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం ఈ కుట్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వం తీరు మొదటి నుంచి ఇలానే ఉంది. సిట్ ద్వారా ప్రలోభ పెట్టడం.. అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇప్పించుకోవడం.. టార్గెట్ చేసిన వ్యక్తుల పేర్లు చెప్పించడం.. తద్వారా కక్ష సాధింపే లక్ష్యంగా అడుగులు వేయడం పరిపాటిగా మారింది. తన కుట్రకు అనుకూలంగా వ్యవహరిస్తే అరెస్ట్ చేయకుండా వదిలేయడం.. బెయిల్ వచ్చేలా సహకరించడం.. లేదంటే అరెస్ట్ చేసి వేధించడమే పనిగా పెట్టుకుంది. వాస్తవానికి మద్యం అక్రమ కేసులో నిందితుడైన సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్‌కు వెళ్లినప్పుడు సిట్ తీవ్రంగా అభ్యంతరం చెప్పాలి. అయితే అందుకు విరుద్దంగా చూసిచూడనట్లు మిన్నకుండి