
నటి మమితా బైజు సినీ ప్రయాణంలో ఓ అందమైన 'ఫుల్ సర్కిల్' మూమెంట్ ఇది. తమిళ నటుడు సూర్య సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం ఆమెకు కేవలం సినిమా అవకాశమే కాదు, చిన్ననాటి కల నిజమైన క్షణం కూడా. మమితా బైజు 8వ తరగతి చదువుతున్నప్పుడు, కేరళలోని లులూ మాల్‌కి ఓ కార్యక్రమానికి సూర్య వచ్చారు. అప్పుడు సూర్యను ఒక్కసారైనా కలవాలని చిన్నారి మమిత చాలా ఆశపడింది. కాలం మారింది. ఆ చిన్నారి పెరిగి, నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ చిన్ననాటి ఆ జ్ఞాపకం మాత్రం మమిత మనసులో అలాగే ఉండిపోయింది. మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మమిత, ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తోంది. ఒకప్పుడు దూరం నుంచి అయినా తన ఫేవరెట్ హీరోను చూడాలని ఆరాటపడిన మమిత, ఇప్పుడు అదే నటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఫ్యాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం, ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఓ అందమైన అధ్యాయంగా మారింది. 2015లో మిస్ అయిన ఆ మూమెంట్, హీరోయిన్‌గా మారి ఇప్పుడు పూర్తయింది. ఇదే కదా అసలైన 'ఫుల్ సర్కిల్' మూమెంట్ అంటే. ఇక సూర్య, మమితా బైజు నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ ఈనెల 14న విడుదల కాబోతుంది