అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. సంక్రాంతికి నవ్వులే పర్ఫెక్ట్!? 2027లోనూ అదే సీన్ రిపీట్
Actor ProfileActor

అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. సంక్రాంతికి నవ్వులే పర్ఫెక్ట్!? 2027లోనూ అదే సీన్ రిపీట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. సంక్రాంతికి నవ్వులే పర్ఫెక్ట్!? 2027లోనూ అదే సీన్ రిపీట్
Telugu Times2 Jan 2027
అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. సంక్రాంతికి నవ్వులే పర్ఫెక్ట్!? 2027లోనూ అదే సీన్ రిపీట్

సూర్య ప్రకాష్ జోశ్యుల భోగి మంటలతో మొదలవుతుంది తెలుగు వారి సంక్రాంతి. చలికాలపు తెల్లవారుజామున ఇంటి ముందు మంటలు. ఆ తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు. గొబ్బెమ్మలు. కొత్త బట్టలు. పిండివంటల వాసన. అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు, బంధువులతో నిండిపోయే ఇళ్లు. పట్టణాల్లో ఉన్నవాళ్లు పల్లెలకు బయలుదేరుతారు. పల్లెల్లో ఉన్నవాళ్లు బంధువుల కోసం ఎదురుచూస్తారు.కోడి పందాలు.గుండాటలు. కొత్త అల్లుడు ఇంటికి రావడం నుంచి.. కనుమ రోజు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వరకు..పెద్ద ఉత్సవంలా సాగుతుంది. ఈ పండుగలో మరో పండుగ ఎప్పుడు చేరిందో మనకు తెలియకుండానే జరిగిపోయింది. అదే సినిమా పండగ. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సినిమా చూడాలి అన్న భావన తెలుగు కుటుంబ జీవనంలో దాదాపు ఒక భాగమైపోయింది. కాబట్టే సంక్రాంతి అంటే తెలుగు పరిశ్రమలో ఒక రిలీజ్ డేట్ గా చూడరు. అది ఒక బిజినెస్ మోడల్ గా గమనిస్తారు. సంవత్సరం ప్రారంభంలో వచ్చే ఆ కొన్ని రోజులు నిర్మాతలకు ఏడాది మొత్తం కలలో కనిపించే బాక్సాఫీస్ విండో. కుటుంబాలు కలిసి సినిమాలకు వెళ్లే సమయం. థియేటర్లకు అదనపు షోలు వేసే సమయం. స్టార్ హీరోలు తమ మార్కెట్‌ను పరీక్షించుకునే సమయం. చాలా కాలంగా సంక్రాంతి అంటే ఒకే రకమైన పోటీ కనిపించేది. కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు, ఆ తర్వాత కాలంలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ. వెంకటేష్ వర్సెస్ నాగార్జున. స్టార్ వర్సెస్ స్టార్.కానీ ఇప్పుడు ఆ పోటీ స్వభావమే మారుతున్నట్టుంది. 2025 నుంచి 2027 వరకు సంక్రాంతి సినిమాలను వరుసగా చూస్తే ఒక ఆసక్తికరమైన pattern కనిపిస్తుంది. సంక్రాంతి ఇక “ఎవరి స్టార్ పవర్ ఎక్కువ?” అన్నట్లు కాకుండా “ఎవరి సినిమా కుటుంబాన్ని థియేటర్‌కు తీసుకువచ్చి, అక్కడ రెండు మూడు గంటలు నవ్వించగలదు?” అనే ప్రశ్నగా మారింది. ఈ మార్పుకు ఒకే వ్యక్తిని కారణంగా చూపడం కొంచెం అతిశయోక్తి కావచ్చు. కానీ ఒక

అన ల ర వ ప డ ఎఫ క ట స క ర త క నవ వ ల పర ఫ క ట 2027ల న అద స న ర ప ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in