
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి 'రామాయణం' యానిమేషన్ మూవీ చేయబోతున్నారు. రామాయణంలోని పాత్రలన్నింటి ఎమోషన్స్ ఆయనే పండించబోతున్నారట. భారతీయ పురాణాలలో గొప్పదైన రామాయణ కావ్యానికి ఉన్న ప్రత్యేక అంతా ఇంతా కాదు. వివిధ భాషల్లో లెక్క పెట్టలేనంత మంది వాల్మీకి రామాయణాన్ని తిరిగి స్పృశించారు. తమదైన భాష్యాన్ని తెలియచేస్తూ సమకాలీనులను ఆనంద పర్చారు. అలానే రామాయణ గాథను, అందులోని సన్నివేశాలను ఎంతోమంది రంగస్థలంపై ప్రదర్శించారు. ఇక ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది వందల చిత్రాలను రూపొందించారు. ఇప్పటికీ రామాయణం గాథ వెండితెరకెక్కుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం రామాయణాన్ని తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కృతం చేయాలని భావిస్తున్నారు. అయితే అది మామూలు సినిమా కాదు యానిమేషన్ మూవీ. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి ఈ రామాయణం గాథపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని తెలిసింది. ఇది మామూలు యానిమేషన్ మూవీ కాదని అనిల్ రావిపూడి సన్నిహితులు చెబుతున్నారు. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించేలా రామాయణ గాథను అనిల్ రావిపూడి తీర్చి దిద్దాలని అనుకుంటున్నారట. ప్రతీ సీన్ ను ఓపికగా డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రతి పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ ను కాగితంపై రాసుకుని, వాటిని తానే అభినయించి, ఆ మూడ్‌ను యానిమేషన్ క్యారెక్టర్స్ కు అప్లయ్ చేయమని అనిల్ రావిపూడి చెప్పబోతున్నారట. రామాయణంలో ఒక్కో పాత్రదీ ఒక్కో శైలి, ఒక్కొక్కరిదీ ఒక్కో బాడీ లాంగ్వేజ్. అలానే ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం. వీరందరికీ సంబంధించిన మూడ్స్ ను అనిల్ రావిపూడే పలికించబోతున్నారట. దానిని డిజిటలైజ్ చేసి