అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచిపోలేను
Actor ProfilePolitician

అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచిపోలేను

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచిపోలేను - తిరిగి గులాబీ గూటికి, అదే బాటలో
Oneindia Telugu9 Dec 2026
అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచిపోలేను - తిరిగి గులాబీ గూటికి, అదే బాటలో

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ.. సీఎం రేవంత్ పైన గురి పెట్టారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన నేతల తీరులో మార్పు కనిపిస్తోంది. తిరిగి కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారు. తిరిగి గులాబీ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైంది. సమీకరణాలు వేగం గా మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే లు పలువురు అధికార పార్టీకి దగ్గరయ్యారు. వీరి అనర్హత వేటు వ్యవహారం సుప్రీం వరకు వెళ్లింది. స్పీకర్ వీరి పిటీషన్లు విచారణ చేసి... క్లీన్ చిట్ ఇచ్చారు. కాగా.. తాజాగా మాజీ స్పీకర్.. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలో కేసీఆర్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఈ విషయం చెప్పడానికి తానేమీ వెనుకాడబోనని అన్నారు. అన్నం పెట్టిన వారిని మరిచిపోలేమని చెప్పారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ.. నియోజకవర్గంలో కొంతమంది వ్యవహార శైలి, తనను పెట్టిన ఇబ్బందులు, మారిన రాజకీయ పరిస్థితుల వల్లే కాంగ్రెస్‏తో కలిసి పనిచేయాల్సి వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!తిరిగి గులాబీ గూటికి..!?కాంగ్రెస్ కు దగ్గరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరిగి కేసీఆర్ పైన తమ అభిమానం చాటు కొనే విధంగా వ్యాఖ్యలు చేసారు. ఇక.. తాజాగా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం చేసిన వ్యాఖ్యలు అదే తరహాలో ఉన్నాయి

అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచిపోలేను
Andhra Jyothy6 Dec 2026
అన్నం పెట్టిన కేసీఆర్ ను మరిచిపోలేను

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి.. కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి/బాన్సువాడ: బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి.. కాంగ్రె్‌సలో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో కేసీఆర్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఈ విషయం చెప్పడానికి తానేమీ వెనుకాడబోనని అన్నారు. అన్నం పెట్టిన వారిని మరిచిపోలేమని చెప్పారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ.. నియోజకవర్గంలో కొంతమంది వ్యవహార శైలి, తనను పెట్టిన ఇబ్బందులు, మారిన రాజకీయ పరిస్థితుల వల్లే కాంగ్రెస్‏తో కలిసి పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం మంజీరా చెక్‌డ్యాం వద్ద కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ పోచారం ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ కాంగ్రెస్‌ కండువా కప్పుకోలేదని, మూడు రంగుల జాతీయ కండువాను కప్పుకొన్నానని తెలిపారు. మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో తాను పార్టీ మారలేదన్నారు. రెండేళ్ల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి.. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడించారని, తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చి.. ఆరు నెలల్లో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇదే విషయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోపాటు ఇతర మంత్రులకూ చెప్పారని పేర్కొన్నారు. కానీ, ముఖ్యమంత్రి హామీ నేటికీ నెరవేరలేదని, సీఎం చెప్పినా మంత్రులు తన ఫోన్‌ ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ముఖ్యమంత్రి మాట కూడా వినడం లేదన్నారు. బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సగంలోనే నిలిపివేశారని చెప్పారు. మెట్రో ఫేజ్‌-1 రుణసేకరణ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌దే

అన న ప ట ట న క స ఆర న మర చ ప ల న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in