
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్‌లో ఒకే ప్రాంగణంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. రెండు విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం వండి పెట్టేవారు. ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో 2018లో బీర్కూర్ మండలం వీరాపూర్ శివారులో కొత్త భవనాన్ని నిర్మించి బడిని అక్కడికి మార్చారు. ఎనిమిదేళ్లు కావొస్తున్నా.. ఇప్పటివరకు కొత్త భవనంలో వంటశాల నిర్మించలేదు. ఫలితంగా 100 మందికి పైగా విద్యార్థులు భోజనం కోసం మధ్యాహ్నం సుమారు అర కి.మీ. దూరంలో ఉన్న పాత పాఠశాలకు పళ్లాలు పట్టుకుని వెళ్తున్నారు. అక్కడ తినేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో భోజనం తీసుకుని తిరిగి కొత్త బడికి వచ్చి తింటున్నారు. ఈ విషయమై ఎంఈవో చందర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా... ‘‘ఆరు నెలల కిందట కొత్త బడిలో వంటశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే నిర్మాణం చేపడతాం’’ అని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు