అన్నీ చూస్తూ భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్ రెడ్డిలా
Actor ProfilePolitician

అన్నీ చూస్తూ భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్ రెడ్డిలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నీ చూస్తూ భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్ రెడ్డిలా, సోనియా చెప్పినా నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు
Samayam Telugu3 Jan 2027
అన్నీ చూస్తూ భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్ రెడ్డిలా, సోనియా చెప్పినా నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు

వనపర్తి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తున్నారని.. అయినా సరే, అన్ని భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా పార్టీలో తప్పులు జరుగుతున్నాయని.. తప్పు చేస్తున్నవారని పంపిస్తామే కానీ తాము పార్టీని వదిలిపెట్టేది లేదన్నారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. తాను పార్టీలో జరుగుతున్నవన్నీ చూస్తూ భరిస్తున్నాను కాబట్టి ఇంకా కొనసాగుతున్నానని.. లేకపోతే మరో జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యేవాడినేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.48 ఏళ్లుగా నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీని స్వార్థంతో కూలగొట్టి కలలను చెదరగొట్టారని.. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు చిన్నారెడ్డి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని సోనియాగాంధీ చెప్పినా.. కొంతమంది డబ్బులకు ఆశపడి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వనపర్తి అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేశానని.. తాను ఎక్కడా, ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదన్నారు. పదేళ్ల పాటూ బీఎఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చానన్నారు. గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నేతల్ని ఆహ్వానించినా రాకపోవడం బాధగా ఉందన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం పనిచేయాలని, ఎలాంటి పనులు కావాలన్నా చేయడానికి కేబినెట్ స్థాయిలో తానున్నానని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.సొంత పార్టీలో నాయకులు నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. తాను అభివృద్ధి పనులు చేపడితే కాంట్రాక్టుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ టవర్ నిర్మాణం, పీజ సెంటర్‌లో హాస్టల్స్ నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఆ పనులు జరగడం లేదని ఆరోపించారు. ఈ పనుల గురించి మంత్రి, అధికారుల దగ్గరకు వెళ్లి అడిగానన్నారు. సొంత పార్టీలో వాళ్లే ఈ పనులు అడ్డుకున్నారని తనకు తెలిసిందన్నారు. గోపాల్‌పేట మండలంలో వ్యవసాయ మార్కెట్‌ను తీసుకెళ్లి

అన న చ స త భర స త న న ల ద ట మర జ వన ర డ డ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in