అన్నవరం బస్టాండ్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
Actor ProfilePolitician

అన్నవరం బస్టాండ్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నవరం బస్టాండ్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
Andhra Jyothy25 Jan 2027
అన్నవరం బస్టాండ్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ, ఆగస్టు 21: అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైనా మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం అన్నవరం ఆర్టీసీ క్యాంటీ‌న్‌ను సందర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు