అన్నయ్య రామ్ చరణ్ హీరోగా సినిమా తీయడమే కల!
Actor ProfileActor

అన్నయ్య రామ్ చరణ్ హీరోగా సినిమా తీయడమే కల!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నయ్య రామ్ చరణ్ హీరోగా సినిమా తీయడమే కల! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Jan 2027
అన్నయ్య రామ్ చరణ్ హీరోగా సినిమా తీయడమే కల! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ (Varun Tej) ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తెరపై తన నటనతో అభిమానులను అలరిస్తున్న వరుణ్ తేజ్ కు, కెమెరా వెనుక నిలబడి యాక్షన్ చెప్పాలనే బలమైన కోరిక ఉండేదట. అందరిలాగే హీరో కావాలనే కలతో ఇండస్ట్రీకి రాలేదని, ముందుగా ఒక దర్శకుడిగా రాణించాలనే లక్ష్యంతోనే తాను సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన స్వయంగా ఒక సందర్భంలో పంచుకున్నాడు. దర్శకత్వంపై ఉన్న అమితమైన ఆసక్తితోనే వరుణ్ తేజ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఒక సినిమాను తెరకెక్కించడం, తెరపై కథను దృశ్య రూపంలో ఆవిష్కరించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అయితే, కుటుంబ వాతావరణం, తోటి నటుల విజయాలు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన నటన వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అలా దర్శకుడిగా మారాల్సిన వ్యక్తి, హీరోగా మారి తొలి సినిమా ‘ముకుంద’తో ప్రేక్షకులను పలకరించారు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తనలోని డైరెక్టర్ మాత్రం ఎప్పుడూ సజీవుగానే ఉన్నాడని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తన అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి పనిచేయాలనే బలమైన కోరిక తనలో ఉందని వరుణ్ తేజ్ మనసులో మాట బయటపెట్టాడు. ఒకవేళ భవిష్యత్తులో తాను దర్శకత్వం వైపు అడుగులు వేస్తే, రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి ఒక అద్భుతమైన సినిమాను తీయాలనే ఆలోచన ఉందంటున్నాడు. రీసెంట్ గా ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో హిట్ కొట్టాడు ఈ మెగా హీరో

అన నయ య ర మ చరణ హ ర గ స న మ త యడమ కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in