అనుగ్రహ
Actor ProfileActor

అనుగ్రహ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అనుగ్రహపై వేటు పడింది
Chitrajyothy25 Sept 2026
అనుగ్రహపై వేటు పడింది

రిసార్ట్ వెబ్ సీరిస్ మేకర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీనిధి పాత్రధారి అనుగ్రహ నంబియార్ ను మొత్తానికి ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రీనిధి ఎగ్జిట్ గురించి ఓ డైలాగ్ లో మేకర్స్ తేల్చిచెప్పేశారు. వర్థమాన నటి అనుగ్రహ నంబియార్‌కు చివరకు అన్యాయమే జరిగింది. ఆమెను 'రిసార్ట్' వెబ్ సీరిస్ నుంచి మేకర్స్ తొలగించారు. తాజాగా ప్రసారమైన ఈ వెబ్ సీరిస్ ఎపిసోడ్స్ తో ఈ విషయం తేటతెల్లమైంది. 'రిసార్ట్' వెబ్ సీరిస్‌లో రూమ్ సర్వీస్ శ్రీనిధి పాత్రను అనుగ్రహ పోషించింది. మొదటి పది పదిహేను ఎపిసోడ్స్ లో ఆమె పాత్రను కీలకంగా చూపించారు. ఉప ప్రేమకథలో ఓ పావుగా శ్రీనిధి పాత్రను మేకర్స్ ఉపయోగించుకున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఆమెది మరీ అంత ప్రధానమైన పాత్ర కాదు. కానీ ఆమెకు మాత్రం ఈ వెబ్ సీరిస్ లో కీలకమైన పాత్ర అని చెప్పి ఒప్పించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే... కొంత కాలం క్రితం అనుగ్రహ ఈ వెబ్ సీరిస్ మేకర్స్ మీద, దీనిలో కథానాయకుడిగా నటించి, స్క్రిప్ట్ ను అందిస్తున్న విజయ్ కుమార్ రాజేంద్రన్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. 'రిసార్ట్' వెబ్ సీరిస్ లో నటించే సమయంలో మరెక్కడ నటించ కూడదని తనతో అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే తనకు ప్రాధాన్యం లేని పాత్రను ఇచ్చారని, ఒక్కోసారి షూటింగ్‌ స్పాట్‌కు రప్పించి కూడా తనపై ఎలాంటి సన్నివేశాలు తీసేవారు కాదని వాపోయింది. ఈ అగ్రిమెంట్‌ కారణంగా తన కెరీర్‌ గ్రాఫ్ తగ్గిపోయిందని, ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇలాగే జరిగితే ఇక ఆత్మహత్యే శరణ్యమని సోషల్ మీడియాలో పేర్కొంది. ఆమె చేసిన ఆరోపణలకు విజయ్ కుమార్ , అతని భార్య నక్షత్ర కౌంటర్ ఇచ్చారు. అనుగ్రహను పోషించే శ్రీనిధి పాత్రను పెంచమని ఆమె కోరిందని, కానీ స్క్రిప్ట్ ప్రకారం తాము సీన్స్ క్రియేట్ చేస్తాం తప్పితే అందుకు వీలు

అన గ రహ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in