అది యాడ్
Actor ProfileActor

అది యాడ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అది యాడ్, నిశ్చితార్థం కాదని క్లారిటీ! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema18 Jan 2027
అది యాడ్, నిశ్చితార్థం కాదని క్లారిటీ! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అయేషా ఖాన్ (Ayesha Khan) గురించి పరిచయం అక్కర్లేదు. “ధురంధర్” సినిమాలో సూపర్ హిట్ ఐటెం సాంగ్ లో కనిపించి ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులరైంది ఈ బ్యూటీ. అందుకే ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగింది. దాంతో, ఆమెకి ఇన్ స్టా లో ప్రొమోషన్ ల కోసం భారీగా డబ్బులు ముట్టచెప్తున్నాయి బ్రాండ్స్. తాజాగా ఒక బ్రాండ్ కోసం ఒక ఫోటోషూట్ చేసి చేసింది. ఐతే మొదట ఫోటోలు షేర్ చేసినప్పుడు జనం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుందేమో అని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే చేతికి రింగ్ పెట్టుకొని ఒక అబ్బాయిని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేసింది. ఆ అబ్బాయి ఫేస్ కనిపించకుండా ‘ఎంగేజ్డ్” అన్నట్లుగా మెసెజ్ పెట్టింది. దాంతో ఎవరా లక్కీ గై అంటూ అభిమానులు ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మరిన్ని ఫోటోలు అప్లోడ్ చేసి క్లారిటీ ఇచ్చింది. ఒక నగల బ్రాండ్ కోసం చేసిన యాడ్ అది అని అర్థం అయింది. ఆమె నిశ్చితార్థం కాదు. ఆయేషా ఖాన్ తెలుగులో కూడా నటించింది. “ముఖ చిత్రం”, “ఓం భీం బుష్”, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, “మనమే” వంటి నాలుగు చిత్రాల్లో నటించింది. ఐతే, “ధురంధర్”లో “శరరత్” పాటతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది