అదే మన లక్ష్యం
Actor ProfilePolitician

అదే మన లక్ష్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అదే మన లక్ష్యం - చంద్రబాబు కీలక పిలుపు
Oneindia Telugu22 Dec 2026
అదే మన లక్ష్యం - చంద్రబాబు కీలక పిలుపు

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు స్పష్టమైన లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను రూపొందించామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని చెప్పారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా...ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నామని... సూపర్ సిక్స్‌ సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో చెప్పినవే కాదు...చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.అమరావతిలో తొలి సారిగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా 10 సూత్రాలను రూపొందించామని చెప్పారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు నిరంతరం పనిచేసి నిర్దేశించుకు న్న లక్ష్యాలను సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో బాధ్యతగా పనిచేయడమే అనే నేను.. సంకల్పానికి అర్థమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్గా, బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ- కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుందని వెల్లడించారు.ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ఎన్ని స్థానాలు.. ఇదీ లెక్క..!!లక్ష్యం తో ముందుకు వెళ్లాలిఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని, మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని అన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విజయం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని చంద్రబాబు అన్నారు. యువత కలలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం సృష్టించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టించాలని సూచించారు. ఎన్నికల హామీలో చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎస్సీలు కోరుకున్న వర్గీకరణను అమలు చేశామన్నారు. 2029

అద మన లక ష య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in