అదీ ధోని స్పెషల్.. చడీచప్పుడు లేకుండా 7’ జెర్సీ రిటైర్మెంట్
Actor ProfileActor

అదీ ధోని స్పెషల్.. చడీచప్పుడు లేకుండా 7’ జెర్సీ రిటైర్మెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అదీ ధోని స్పెషల్.. చడీచప్పుడు లేకుండా 7’ జెర్సీ రిటైర్మెంట్
Eenadu23 Dec 2026
అదీ ధోని స్పెషల్.. చడీచప్పుడు లేకుండా 7’ జెర్సీ రిటైర్మెంట్

మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన సారథి.. భారత జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్‌. వికెట్ కీపర్‌గానూ చురుకైన పాత్ర. మరి ఇలాంటి ప్లేయర్‌కు ఎంతటి ఘనమైన వీడ్కోలు అందాలి. కానీ, అవేవీ తనకు అవసరం లేదని భావించాడీ ‘కెప్టెన్ కూల్‌’ (Captain Cool). అంతర్జాతీయంగా తన ‘7’వ నంబర్‌ జెర్సీకి చడీచప్పుడు లేకుండా గుడ్‌బై చెప్పేసి ఆరేళ్లైనా ఇప్పటికీ ‘ధోని’ ఘనతలను మరువలేం. అదీనూ భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే వీడ్కోలు చెప్పడం విశేషం. ఇటీవల అజింక్య రహానే తన రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా కొందరు ప్లేయర్లు ఇలానే చెప్పారు. విరాట్, రోహిత్ అయితే టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పేశారు. కానీ, పెద్దగా ప్రచారం కోరుకోని ధోని (MS Dhoni) మాత్రం ఓ ఆసక్తికరమైన పోస్టుతో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అమితాబ్‌ బచ్చన్ నటించిన కభికభీ సినిమాలోని సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టాడు. ‘‘ఇవాళ రాత్రి 19:29 గంటల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు పరిగణనలోకి తీసుకోండి’’ అని 2020 ఆగస్టు 15న అభిమానుల కోసం పోస్టు పెట్టాడు. డిసెంబర్ 2019లో బోరియా మజుందార్‌తో ఓ షోలో ధోని ఆ పాటను రెండు లైన్లు పాడటం విశేషం. సాధారణంగా ఎవరైనా ప్లేయర్‌ తాము అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నామని జట్టు మేనేజ్‌మెంట్‌కు చెప్పడం సహజం. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ను ఆడించి ఘనమైన వీడ్కోలు పలకడం ఆనవాయితీ. కానీ, ధోని మాత్రం ఇలాంటివి కోరుకోలేదు. భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను 2019 జులైలో ఆడాడు. దాదాపు 13 నెలల తర్వాత అంటే 2020 ఆగస్టు 15న ఆటకు గుడ్‌బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ‘‘మాట కాదు.. పనే మాట్లాడాలి’ అన్నట్లుగా ధోని (Dhoni Records) సాధించిన ఘనతలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ధోనితోపాటు సురేశ్ రైనా కూడా ఇదే రోజున

అద ధ న స ప షల చడ చప ప డ ల క డ 7 జ ర స ర ట ర మ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in