
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు ఈ కింద చదవండి… ఈ మాటలన్నీ అనుపమ పరమేశ్వరన్ చెప్పింది కానీ ఆ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు. ఆమె మాటలను బట్టి ఆమె ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందో, అతను ఎవరో ఇట్టే అర్థం అయిపోతోంది. బైసన్ అనే చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా హీరో ధృవ్ విక్రమ్ (హీరో విక్రమ్ కొడుకు)తో డేటింగ్ చేసింది. వారిద్దరూ ఒక పబ్ లో లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటున్న వీడియో కూడా బయటికి వచ్చింది. ఈ సినిమా 2025లో విడుదల అయింది. అంతకు ఏడాది ముందు నుంచే వీరి డేటింగ్ షురూ అయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన “డ్రాగన్” చిత్రం కూడా గతేడాదే విడుదల అయింది. డ్రాగన్ సినిమాని తన బాయ్ ఫ్రెండ్ ఆంక్షల వల్లే ప్రమోట్ చేసుకోలేకపోయాను అని చెప్పింది అంటే అప్పుడు రిలేషన్ లో ఉన్నది ధృవ్ విక్రమ్ తోనే. సో, పేరు చెప్పకపోయినా ఆమె ఇచ్చిన ‘డ్రాగన్’ హింట్ తో ఆమె అతని గురించే మాట్లాడింది అని అర్థం అవుతోంది. ఆమె ఇటీవలే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టింది. నర్మగర్భమైన పోస్టులతోనే ఆమె ధృవ్ తో కటీఫ్ చేసుకుందని తెలిసిపోయింది. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆమెని ఈ పోస్టుల గురించి, బ్రేకప్ గురించి అడిగితే సీరియస్ అయింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ఇంటర్వ్యూలో తాను రెండేళ్లు టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఇప్పుడు చెప్తోంది