అతని కోసం రూల్స్ అన్ని బ్రేక్ చేసిన నయనతార.. ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాను అంటూ
Actor ProfileActor

అతని కోసం రూల్స్ అన్ని బ్రేక్ చేసిన నయనతార.. ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాను అంటూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అతని కోసం రూల్స్ అన్ని బ్రేక్ చేసిన నయనతార.. ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాను అంటూ కామెంట్స్
Zee Telugu19 Nov 2026
అతని కోసం రూల్స్ అన్ని బ్రేక్ చేసిన నయనతార.. ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాను అంటూ కామెంట్స్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Nayanthara:యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆసక్తి కనిపిస్తోంది. తాను సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌కు ఎందుకు హాజరుకానో నయనతార ఈ కార్యక్రమంలో వివరించారు. ప్రమోషన్స్ అంటే తనకు ఇష్టం లేదని కాదు.. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు అంత సౌకర్యంగా అనిపించదని చెప్పారు. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం యష్ కారణంగా తాను ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చానని నయనతార చెప్పారు. యష్ తనకు ఫోన్ చేసి అడిగిన తర్వాత ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. యష్‌ను మొదటిసారి కలిసిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. తాను ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని చెప్పిన నయనతార.. యష్‌ను కలిసినప్పుడు మాత్రం అతని వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా అనిపించిందన్నారు. అతని లార్జర్-దెన్-లైఫ్ ఇమేజ్ చూసి, తాను ‘రాకీ భాయ్ రాజ్యంలోకి వెళ్తున్నానా?’ అని అనుకున్నానని సరదాగా చెప్పారు. అంతేకాదు, యష్ కష్టపడి పనిచేసే విధానాన్ని నయనతార ప్రశంసించారు. తాను ఇప్పటివరకు ఇంతగా శ్రమించే నటుడిని చూడలేదని అన్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు యష్ తన సమయం, శక్తిని ‘టాక్సిక్’ సినిమాకు కేటాయించారని చెప్పారు. చివర్లో తన మనసులోని మాటలన్నీ చెప్పేశానని గుర్తించిన