అతడు పెద్ద సైకో..సిగరెట్లతో కాల్చి
Actor ProfileActor

అతడు పెద్ద సైకో..సిగరెట్లతో కాల్చి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అతడు పెద్ద సైకో..సిగరెట్లతో కాల్చి, ఎలా పడితే అలా కొట్టాడు టాలీవుడ్ హీరోయిన్ కంటతడి
Zee Telugu27 Sept 2026
అతడు పెద్ద సైకో..సిగరెట్లతో కాల్చి, ఎలా పడితే అలా కొట్టాడు టాలీవుడ్ హీరోయిన్ కంటతడి

Niti Taylor Boyfriend: 'మేం వయసుకు వచ్చాం' సినిమాలో హీరోయిన్ గుర్తుందా? అప్పట్లో ఆ సినిమాలో ఆమె అందంతో పాటు నటనతో అలరించింది. అయితే ఆమె బాయ్‌ఫ్రెండ్ తనను వేధించేడాని, సిగరెట్లతో కాల్చాడని చెప్పుకొచ్చింది. 2012లో విడుదలైన 'మేం వయసుకు వచ్చాం' సినిమా గుర్తుందా? అప్పట్లో ఆ సినిమా యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. తనీష్, నితీ టేలర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమాతో పాటు సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తనీష్.. ఈ సినిమాలో హీరోగా మెప్పించాడు. అయితే ఈ సినిమాలో హీరో తనీష్‌తో పాటు హీరోయిన్ నితీ టేలర్ నటనపై మంచి ప్రశంసలు వచ్చాయి. ఆమె అందంతో పాటు అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత ఈమె బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. ఓటీటీ రియాలిటీ గేమ్ షో 'అలయన్స్'లో నితీ టేలర్ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎంతో హింసించాడని.. సిగరెట్‌తో కాల్చేవాడని.. పిచ్చివాడిలా మాట్లాడుతూ తనను తరచూ కొట్టేవాడని హీరోయిన్ నితీ టేలర్ వెల్లడించింది. తన మాజీ ప్రియుడు ఓ సైకో లాంటి వాడని చెప్తూ బాధపడింది. ఆ తర్వాత తనకు బ్రేకప్ చెప్పినట్లు తెలిపింది

అతడ ప ద ద స క స గర ట లత క ల చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in