అతడిని దారుణంగా కొట్టి సిగరెట్లతో కాల్చారు.. రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు
Actor ProfileActor

అతడిని దారుణంగా కొట్టి సిగరెట్లతో కాల్చారు.. రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అతడిని దారుణంగా కొట్టి సిగరెట్లతో కాల్చారు.. రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు
TV9 Telugu26 Nov 2026
అతడిని దారుణంగా కొట్టి సిగరెట్లతో కాల్చారు.. రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ హీరో దర్శన్ స్నేహితుడు రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రదోష్, తనను క్షమాభిక్ష సాక్షిగా పరిగణించాలని కోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేశాడు. ఈ కేసులో 14వ నిందితుడైన ప్రదోష్, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టుతో పంచుకుంటానని.. అందుకు తన క్షమాభిక్షను పరిగణించాలని దరఖాస్తు చేసుకున్నాు. ప్రదోష్ దాఖలు చేసిన దరఖాస్తులో కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోజు జరిగిన ఘటన నుంచి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతి అంశాన్నీ అతడు పిటిషన్ లో పేర్కొన్నారు. పవిత్ర గౌడకు సందేశాలు పంపించాడని దర్శన్ రేణుకాస్వామిని నిలదీశాడని.. ఆ సమయంలో అతడిని దారుణంగా కొట్టడంతో అతడి తల నుంచి రక్తం రావడం తాను చూశానని అన్నారు. అంతేకాకుండా అతడిని కిడ్నాప్ చేసి బంధించిన ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిచి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారని.. ఆ తర్వాత అతడిపై విచక్షరణ రహితంగా దాడి చేసి లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్ కు వేలాడదీసి నైలాన్ తాడుతో కొట్టారని ప్రదోష్ తెలిపారు. అంతలా కొడితే అతడు చనిపోతాడని తాను చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోలేదని.. అతడికి ఆహారం, నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ అతడి ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారని.. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడని తెలిపారు. వెంటనే దర్శన్ తన రెండు కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించాడని.. తాను జోక్యం చేసుకుని అతడిని పక్కకు లాగానని తెలిపారు. అయితే రేణుకాస్వామి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని సద్ధుమణిగేలా చేయకపోతే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ తను బెదిరించారని.. దీంతో అసలు విషయం చెప్పకుండా కల్పిత కథ చెప్పేందుకు చర్చలు జరిగాయని వెల్లడించారు. కేసులో సహకరించకపోతే కాల్చి చంపుతానని దర్శన్ బెదిరించడంతో, తాను దర్శన్‌కు సహాయం చేశానని ప్రదోష్

అతడ న ద ర ణ గ క ట ట స గర ట లత క ల చ ర ర ణ క స వ మ హత య క స ల స చలన వ షయ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in