అడుగడుగునా ఆంక్షలు
Actor ProfilePolitician

అడుగడుగునా ఆంక్షలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అడుగడుగునా ఆంక్షలు- అయినా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు
Oneindia Telugu25 Nov 2026
అడుగడుగునా ఆంక్షలు- అయినా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు

మెగా డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.శ్రీకాకుళం నుంచి పులివెందుల వరకూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ర్యాలీలు కొనసాగాయి. వాటికి పలు చోట్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పార్టీ నాయకులకు నోటీసులను జారీ చేశారు. ర్యాలీలకు వస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గట్లేదని అన్నారు.విశాఖపట్నంలో ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలకు రావద్దంటూ పార్టీ శ్రేణులకు తెలియజేశారు. దీంతోపాటు నిరసన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజువాకలో ర్యాలీకి బయలుదేరిన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవన్‌రెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలకు వైసీపీ సిద్ధం కాగా.. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.బంగారం ధరల్లో మిక్స్డ్ ట్రెండ్- అవి పైపైకి.. ఇవి భారీగా డౌన్మాజీ ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. కాకినాడ జిల్లా తునిలోనూ ర్యాలీకి అనుమతి లేదంటూ పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చారు. సెక్షన్‌ 30 అమల్లో ఉందని తెలిపారు. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చిన పోలీసులు, ర్యాలీ నిర్వహిస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్అనంతపురం జిల్లా