అగధ సినిమా రిజల్ట్
Actor ProfileActor

అగధ సినిమా రిజల్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్ రాజు రియాక్షన్ .. ఎమోషనల్ కామెంట్
Asianet News Telugu24 Dec 2026
అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్ రాజు రియాక్షన్ .. ఎమోషనల్ కామెంట్

స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం `అగధ`. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. శ్రావణ్‌ రెడ్డి, షిజ్జు, వనితా విజయ్‌ కుమార్‌, జోవికా, ఉల్కా గుప్తా, భాను చందర్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విడుదలయ్యింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో మూవీ రిజల్ట్ పై దర్శకుడు ఎంఎస్‌ రాజు ఒక నోట్‌ని రిలీజ్‌ చేశారు. ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లని అభినందించారు. `మా చిత్రం `అగధ` ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఎంతో అలరిస్తూ, షో షోకి కలెక్షన్లు పెరుగుతూ బ్లాక్‌ బస్టర్‌ వైపు అడుగులు వేస్తోంది. అందరూ మా చిత్రాన్ని `దేవి, `అరుంధతి` సినిమాలతో పోలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం హర్రర్‌ చిత్రం మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని, మహిళా ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ అంటున్నారు. నిన్న ఫోన్‌ కాల్స్ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా ఎంతో మంది ఈ చిత్రం విజయాన్ని తెలియజేస్తుండటంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారందరికీ మా కృతజ్ఞతలు. ఈ సినిమా సక్సెస్‌ సందర్భంగా సమర్పకులైన అజయ్‌ కె ఆర్‌ గారికి, నిర్మాత అయిన కాశీ విశాలక్షి బలుసు గారికి అభినందనలు` అని చెప్పారు ఎంఎస్‌ రాజు. ఇంకా ఇందులో ఆయన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల గురించి చెబుతూ, `మహాదేవి పాత్రను అద్భుతంగా పోషించిన కామాక్షి భాస్కర్ల ఈ చిత్రం కోసమే పుట్టిందని అందరూ పొగుడుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సింహ పాత్రను పోషించిన శ్రవణ్‌ రెడ్డి నటన గురించి వస్తున్న ప్రశంసల వెల్లువ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాగే ఈ చిత్రంలో నటించిన జోవికా, ఉల్కా, సిజ్జు వారి పాత్రలను అద్భుతంగా పోషించారని అందరూ అంటున్నారు. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా