అగధ మూవీ రివ్యూ
Actor ProfileActor

అగధ మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగధ మూవీ రివ్యూ, రేటింగ్ .. ఎంఎస్ రాజు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా? కామాక్షికి హిట్ పడిందా
Asianet News Telugu18 Dec 2026
అగధ మూవీ రివ్యూ, రేటింగ్ .. ఎంఎస్ రాజు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా? కామాక్షికి హిట్ పడిందా

ఒకప్పుడు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్‌ రాజు ఇటీవల నిర్మాణం పక్కన పెట్టి దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `అగధ` చిత్రాన్ని రూపొందించారు. మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించగా, శ్రావణ్‌ రెడ్డి, షిజ్జు, ఉల్కా గుప్తా, వనితా విజయ్‌ కుమార్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 14)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ఎంఎస్‌ రాజు దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షి భాస్కర్ల ఆడియెన్స్ ని మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఆంధ్రా, ఓరిస్సా బార్డర్‌లో శుక్లా అనే గ్రామంలోని దేవత వద్దకు వస్తుంది మహాదేవి(కామాక్షి భాస్కర్ల). ఆమెని చిన్నప్పుడు అమ్మవారే పిలిపించుకుంటుంది. అక్కడ దెయ్యాలను, భూతులను వదిలిస్తుంటుంది మహాదేవి. ఆమె గురించి తెలుసుకోవడానికి ఒక రైటర్‌ వస్తుంది. మరోవైపు అదే ఫారెస్ట్ లోని మిస్టరీ గుహ రహస్యాన్ని రివీల్‌ చేయడానికి మహాదేవి బాబాయ్‌(భానుచందర్‌) కూతురు మహిమ(ఉల్కా గుప్తా) తన ప్రియుడు సింహా(శ్రావణ్‌ రెడ్డి), ఫ్రెండ్‌(వైవా రఘు)తో కలిసి వెళ్తుంది. అక్కడ గుహలోకి వెళ్లిన సింహా కనిపించకుండా పోతాడు. వైవా రఘు గుహ నుంచి బయటకు రాగానే తల ఎగిరిపడుతుంది. ఇది గర్భిణి అయిన మహిహ చూసి షాక్‌ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వస్తుంది. కానీ అదోలా ఉన్న మహిమ ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది. ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా ఇంట్లో వాళ్లు చనిపోతుంటారు. మహిమ చనిపోయిన విషయం తెలిసి ఆ సాలూరు గ్రామానికి వెళ్తుంది మహాదేవి. అక్కడ బాబాయ్‌ మరో కూతురు హరిణి(జోవికా విజయ్‌ కుమార్‌) వింతగా ప్రవర్తిస్తుంటుంది. దీంతో

అగధ మ వ ర వ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in