
‘అగధ’ కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను – కామాక్షి భాస్కర్ల శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది – కామాక్షి భాస్కర్ల కామాక్షి భాస్కర్ల ఎంచుకునే సినిమాలు, కథలు, సాధిస్తున్న విజయాల గురించి అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓరియెంట్ ప్రాజెక్ట్‌లని చేస్తూ దూసుకుపోతోన్న కామాక్షి భాస్కర్ల రేపు (ఆగస్ట్ 14) ‘అగధ’ అంటూ రాబోతోన్నారు. ఈ సినిమాని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు. ఈ మూవీలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. శుక్రవారం సినిమా విడుదల అవుతున్న సందర్భంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలేంటో ఓ సారి చూద్దాం. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని అనుష్కతో పోల్చారు? దానిపై మీ స్పందన ఏంటి? అంత పెద్ద నిర్మాత నన్ను అలా పోల్చడం ఆనందంగా అనిపించింది. ఆయన అనుష్క గారితో పోల్చడం అనేది నన్ను మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుంది (నవ్వుతూ). ‘అగధ’లోని వస్త్రాధారణ గురించి చెప్పండి? ‘అగధ’లో ప్రతీది కూడా రాజు విజన్ అని చెప్పుకోవచ్చు. ప్రతీది డిఫరెంట్‌గా ఉండాలని ముందే ఆయన అనుకున్నారు. అలాంటి చీరకట్టులో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. ‘అగధ’లోని యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పండి? ‘అగధ’లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మేం ముందుగానే వర్క్ షాప్స్ చేశాం. రిహార్సల్స్ చేశాం. అయితే సెట్‌లో చిన్న చిన్న ఇబ్బందులు సహజం. కానీ టీం అంతా కలిసి శ్రమించడం వల్ల అవుట్ పుట్ బాగా వచ్చింది. ‘అగధ’ జర్నీలో