అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్
Actor ProfileActor

అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్ , 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్ రాజు బిగ్ మిస్టేక్
Asianet News Telugu2 Jan 2027
అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్ , 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్ రాజు బిగ్ మిస్టేక్

నిర్మాత ఎంఎస్‌ రాజు లేట్‌ వయసులో దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మాతగా అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తీశారు. స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణించారు. కానీ వరుస పరాజయాల తర్వాత నిర్మాణం పక్కన పెట్టారు. అదే సమయంలో తన కొడుకు సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు. కొడుకుని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కూడా హీరోగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. దీంతో ఎంఎస్‌ రాజు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే `వాన`, `డర్టీ హరి`, `7నైట్స్ 6డేస్‌`, `మళ్లీ పెళ్లి` వంటి చిత్రాలను రూపొందించారు. ఇవి పెద్దగా ఆడలేదు. లేటెస్ట్ గా `అగధ` చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్‌ గా హీరో కొట్టాలని, దర్శకుడిగా సక్సెస్‌ కావాలనే తపనతో మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌ `అగధ` చిత్రాన్ని రూపొందించారు ఎంఎస్‌ రాజు. హర్రర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలు కంటెంటే బాగుంటే మంచి ఆదరణ పొందుతాయి. హిట్ కొట్టడం ఈజీ. దీంతో ఎంఎస్‌ రాజు కూడా అదే ప్లాన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించగా, శ్రావణ్‌ రెడ్డి, భానుచందర్‌, వనితా విజయ్‌ కుమార్‌, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌ కుమార్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీ గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమా ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. థ్రిల్‌ చేయలేకపోయిందని, భయపెట్టలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. స్లోగా సాగిందని, ఎంగేజ్‌ చేయలేకపోయిందంటున్నారు. అదే తరహాలో కలెక్షన్లు ఉన్నాయి. ఈ మూవీ పెద్ద రేంజ్‌ లో హిట్ అవుతుందని ఎంఎస్‌ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. ఇప్పటి వరకు ఈ మూవీ కోటి వరకు మాత్రమే కలెక్షన్లని రాబట్టింది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.1.17కోట్లు(ఇండియాలో) రాబట్టింది. మూడో రోజు రూ.39లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారుగా రూ.1.30కోట్లు వసూలు

అగధక బ క స ఫ స వద ద ప ద ద ష క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in