
Eenadu•24 Sept 2026
అఖిల్ సెట్ అవుతాడా అని భయపడ్డాఇంటర్నెట్ డెస్క్: అఖిల్ హీరోగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘లెనిన్’. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది (Lenin Release Date). ఈ నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. అఖిల్ ఈ చిత్రంతో కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు. ‘‘అఖిల్ ఇప్పటిదాకా అర్బన్ కథలే చేశాడు.. ఈ చిత్రానికి సెట్ అవుతాడా అని కాస్త భయపడ్డా. కానీ, ఈ సినిమా చూశాక నేనే కాదు.. అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్‌గా మారిపోయాడు’’ అని చెప్పారు. మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో అఖిల్‌కు (Akhil) జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ వీడియో చూశారా: అందుకే మీకు నా మొహం చూపించలేకపోతున్నా: అఖిల్