అఖిల్ 'లెనిన్' క లెక్ష న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ ట్టిందంటే
Actor ProfileActor

అఖిల్ 'లెనిన్' క లెక్ష న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ ట్టిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ 'లెనిన్' క లెక్ష న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ ట్టిందంటే
AP7AM6 Nov 2026
అఖిల్ 'లెనిన్' క లెక్ష న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ ట్టిందంటే

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. "మొదటి వారాంతం అద్భుతంగా ముగిసింది. ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. బాక్సాఫీస్ వేడుక చేసుకుంది. 'లెనిన్' కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది" అంటూ తమ పోస్ట్‌లో పేర్కొంది.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమాలోని యాక్షన్ ఘట్టాలతో పాటు ఎస్‌ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది

అఖ ల ల న న క ల క ష న ల ద క డ మ డ ర జ ల ల ఎ త ర బ ట ట ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in