అఖిల్’ తదుపరి కథ
Actor ProfileCelebrity

అఖిల్’ తదుపరి కథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ
123Telugu1 Jan 2027
అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ

బాక్సాఫీస్ వద్ద అఖిల్ ‘లెనిన్’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం సాధించిన భారీ వసూళ్లతో అక్కినేని ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ లభించింది. అన్నిటికీ మించి అఖిల్ కెరీర్ కి భారీ ఊరట లభించింది. ఏది ఏమైనా లెనిన్’తో మంచి సక్సెస్ రావడంతో, ఇప్పుడు అఖిల్ తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి. అఖిల్ సక్సెస్ కొనసాగాలంటే మళ్లీ ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ చర్చ మొదలుపెట్టారు. అఖిల్ మళ్లీ అదే తరహా రూరల్ యాక్షన్ కాకుండా, పూర్తిగా కొత్త బ్యాక్‌డ్రాప్‌లో కథ ఎంచుకుంటే బాగుంటుందని కొందరు.. అఖిల్ ఎనర్జీ, లుక్స్, యాక్షన్‌కు తగ్గట్టుగా ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా అయితే మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఇంకొందరు అభిప్రాయం. మొత్తానికి ఇప్పటివరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో అఖిల్‌ను చూపిస్తే, ‘లెనిన్’తో వచ్చిన క్రేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు. కాబట్టి లెనిన్ తర్వాత అఖిల్‌కు కావాల్సింది, మరో సేఫ్ సినిమా కాదు, అతని ఇమేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే కొత్త తరహా కథ. మరి ఆ దిశగా అఖిల్ కథల ఎంపిక ఉంటే, హిట్ విషయంలో అఖిల్ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చినట్టే

అఖ ల తద పర కథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in