అక్టోబరులోగా పురపోరు
Actor ProfilePolitician

అక్టోబరులోగా పురపోరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్టోబరులోగా పురపోరు
Andhra Jyothy13 Jan 2027
అక్టోబరులోగా పురపోరు

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయానికి వస్తే.. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది. చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్‌ ఆమోదించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెట్‌ కమిషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మంత్రి మండలికి అధికారులు వివరించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. సకాలంలో ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను భారీగా