
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TTD October Quota 2026 Released: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆశపడతారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లను జారీ చేస్తారు. వీటిని ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకోవాలి.. తద్వారా మూడు నెలల తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఆర్జిత సేవలు, సహస్రదీపాలంకరణ, రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదే రోజు గదుల కోటా కూడా విడుదల చేస్తారు. కాబట్టి, ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అక్టోబర్ నెల దర్శన కోట వివరాలను TTD ఈరోజు విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవారి అర్చిత సేవా టికెట్లు, అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన కోటను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నారు. ఆన్‌లైన్‌లో భక్తులు ఈ సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ లాటరీ (Lucky Dip) ప్రక్రియ జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. భక్తులు తమ ఆధార్ కార్డు, పేరు, ఫోన్ నెంబర్ ,ఈమెయిల్ ఐడి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాటరీలో ఎంపికైన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరు చేయబడతాయి. అదేవిధంగా, 2026 జూలై 21వ తేదీన తిరుమల శ్రీవారి