
ఇంటర్నెట్ డెస్క్: ఏడు నెలల నిరీక్షణకు చెక్ పెడుతూ.. ‘జన నాయగన్’ జులై 24న సందడి చేయనుంది. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాకు (Jana Nayagan) సెన్సార్ బోర్డు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. బోర్డు చెప్పిన మార్పులను చేసి చిత్రబృందం దీన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా అన్‌కట్ వెర్షన్ విడుదల కానుంది. భారత్‌లో పలు కట్స్ విధించినప్పటికీ, యూకే (UK)లో మాత్రం ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ ఈ సినిమాను ఎలాంటి మార్పుల్లేకుండానే విడుదల చేసేందుకు అనుమతి లభించింది. ఇక విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో సినిమా టైటిల్ కార్డులోనూ మార్పు చేశారు. గతంలో దళపతి విజయ్ అనే టైటిల్ కార్డు.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌గా మారనుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 12 మార్పులు సూచించి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. విజయ్ (Vijay) నేతృత్వంలోని రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ప్రస్తావన ఉన్న డైలాగ్‌లను తొలగించడంతో పాటు కొన్ని పదాలను మ్యూట్ చేయాలని.. మరికొన్ని సన్నివేశాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. విడుదల నేపథ్యంలో త్వరలోనే దీని రిలీజ్ ట్రైలర్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇటీవల ఓ డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో తెగ వైరలైన బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వీని