
పులివెందుల: డీఎస్సీపై వైకాపా (YSRCP) నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు మాత్రమే ఉన్నారని తెదేపా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. డీఎస్సీ రాసిన విద్యార్థులు ఎవరూ ఆ ర్యాలీలో లేరని చెప్పారు. స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనర్ విద్యార్థులకు వైకాపా కండువాలు వేసి ర్యాలీలు చేయడం బాధిస్తోందన్నారు. పులివెందులలో విద్యార్థులు ర్యాలీకి రాకపోతే కళాశాలలు నడపలేరంటూ కొందరు వైకాపా నేతలు యాజమాన్యాలను బెదిరించారని ఆరోపించారు. వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో ఇలా చేయడమేంటని బీటెక్ రవి ప్రశ్నించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.